ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర' ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 1990ల కాలం నేపథ్యంలో బ్యాంకుల అప్పులు, వాటిని తీర్చలేక ఒక వ్యక్తి నేర ప్రపంచంలోకి అడుగుపెట్టే పరిస్థితులను ఈ చిత్రంలో వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు.
ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న విడదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.40 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రంలో ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు కేఎస్ రవికుమార్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తన సంగీతంతో 1990ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా తెరపై కనిపించేలా చేశారు.
ఓటీటీలోకి వచ్చిన ధనుష్ కొత్త సినిమా...
