ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ ట్రెజరీ భారత్‌పై సంచలన కామెంట్లు చేశారు. భారత్ శుభ్రత లేని దేశమని అన్నారు. పొరుగు దేశం శ్రీలంకపై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. షెహనాజ్ ట్రెజరీ శ్రీలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లా రైల్వేకు ఆమె వెళ్లారు. రైల్వే స్టేషన్‌లో పరిశుభ్రత, అక్కడ భారీ సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. రైల్వే స్టేషన్ పరిశుభ్రతపై ఆమె ఓ వీడియో చిత్రీకరించారు. భారత్‌లో పరిశుభ్రత గురించి ప్రస్తావించారు.