గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండితెరపైనే కాదు, వంటింట్లో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఆయన వండే బిర్యానీ, నాటు కోడి కూర గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఉంది. అయితే, తాజాగా తారక్ తన కుకింగ్ స్కిల్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లి.. మొదటిసారి కుకీస్ బేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

 

 

ఎన్టీఆర్ తాను స్వయంగా చేసిన కుకీస్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది చూసిన సాయి తేజ అనే అభిమాని సరదాగా ఇలా కామెంట్ చేశాడు. "అన్నా, మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాకు కూడా రెండు కుకీస్ పంపిస్తావా?" అని అడిగాడు. దీనికి తారక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ‘కింగ్’ సినిమాలోని బ్రహ్మానందం పాపులర్ మీమ్ డైలాగ్‌తో రిప్లై ఇచ్చాడు. “అడ్రస్ పెట్టు.. ఫాస్ట్ గా అడ్రస్ పెట్టు” అని సమాధానమిచ్చాడు.

 

ఎన్టీఆర్ నుండి ఊహించని రిప్లై రావడంతో ఆ అభిమాని షాక్ అయ్యాడు. "అన్నా.. నీ రిప్లై చూసి నా చేతులు, కాళ్లు వణుకుతున్నాయి, కళ్లలో నీళ్లు ఆగడం లేదు. నా జీవితంలో ఇది మర్చిపోలేని క్షణం" అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే, తారక్ కేవలం రిప్లైతోనే ఆగిపోకుండా, అన్న మాట ప్రకారం ఆ అభిమాని ఇంటికి నిజంగానే కుకీస్ పంపించి తన మనసును చాటుకున్నాడు.

 

ఇక మరో నెటిజన్.. "బిర్యానీ, చికెన్ వండే టైగర్ ఇప్పుడు కుకీస్ కూడా చేస్తున్నారా?" అని జోక్ చేయగా... దానికి కూడా తారక్ అంతే ఫన్నీగా మరో బ్రహ్మానందం మీమ్ డైలాగ్ “మారాయ్.. అన్నీ మారాయ్!” అంటూ రిప్లై ఇచ్చారు. అభిమానులతో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సరదా సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.