నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి, ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు, గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలోని ఉపాధి పనులకు వచ్చిన మహిళలకు శక్తి యాప్ గురించి, దాని నంబర్ 7993485111 ను తెలిపి, యాప్ వలన ఉపయోగములు వివరించారు. 18 సంవత్సరములు దాటేంతవరకు అమ్మాయిలకు వివాహం చేయరాదని, ఎక్కడైనా బాల్య వివాహములు, చిన్న పిల్లలపై అత్యాచారాలు జరిగినచో టోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫోన్ చేయవలెనని, సైబర్ నేరములు జరిగినచో అనగా ఆన్లైన్లో మోసముల గురించి అవగాహన కల్పించారు.