అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా... ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచించిందంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైసీపీ హైకమాండ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.